‘ఫుల్‌’ జోష్‌!

ABN , First Publish Date - 2021-01-17T05:14:33+05:30 IST

మందుబాబులు పండగ చేసుకున్నారు. మూడు రోజులూ ‘ఫుల్‌ ’జోష్‌గా కనిపించారు. కోట్ల రూపాయల్లో మందు లాగించేశారు. సాధారణ రోజుల్లో రూ.మూడు కోట్ల వరకు జరిగే మద్యం విక్రయాలు.. పండగ మూడురోజులు కలిసి సుమారు రూ.30 కోట్ల వరకూ చేరుకున్నాయి.

‘ఫుల్‌’ జోష్‌!
మద్యం కొనుగోలు చేస్తున్న మందుబాబులు

 మూడు రోజుల్లో రూ.30 కోట్ల మద్యం విక్రయాలు

పెరిగిన ఆదాయం 

 విజయనగరం (ఆంధ్రజ్యోతి): మందుబాబులు పండగ చేసుకున్నారు. మూడు రోజులూ ‘ఫుల్‌ ’జోష్‌గా కనిపించారు. కోట్ల రూపాయల్లో మందు లాగించేశారు. సాధారణ రోజుల్లో రూ.మూడు కోట్ల వరకు జరిగే మద్యం విక్రయాలు.. పండగ మూడురోజులు కలిసి సుమారు రూ.30 కోట్ల వరకూ చేరుకున్నాయి. అధికారుల లెక్కలను పరిశీలిస్తే.. సంక్రాంతి పండగలో మద్యం బాబులదే హవాగా కనిపిస్తోంది. పండగ ఖర్చులో ఎక్కువ  మంది మద్యానికే వ్యయం చేసినట్టు సమాచారం. నెల్లిమర్ల డిపో నుంచే జిల్లా అంతటికీ మద్యం సరఫరా  అవుతుంది. వారం రోజులుగా నెల్లిమర్ల మద్యం డిపో వద్ద మద్యం సరఫరా వాహనాలు బారులుదీరాయి. దుకాణ యజమానులు ముందుగానే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ మేరకు సంక్రాంతికి ముందే విరివిగా ఆర్డర్లు ఇచ్చారు. జిల్లాలోని 34 మండలాలు, మూడు మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌ పరిధిలో 18 బార్లు, 142 మద్యం షాపుల ద్వారా సుమారు రూ.30 కోట్ల మేర వ్యాపారం జరిగింది. ఆదివారం మరింతగా మద్యం విక్రయాలు జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా జిల్లావాసులు కనుమ రోజు మటన్‌, చేపలు, చికెన్‌పై ఎక్కువగా వ్యయం చేశారు. పండగ మూడు రోజులు కలిపి సుమరు  రెండు టన్నుల 50 క్వింటాళ్ల చికిన్‌ విక్రయాలు జరిగినట్టు వ్యాపార వర్గాలు తెలిపాయి. 


Updated Date - 2021-01-17T05:14:33+05:30 IST