సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు

Published: Sat, 26 Mar 2022 23:48:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు అభివాదం చేస్తున్న ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు 

సుభాష్‌నగర్‌, మార్చి 26: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని సీపీఎం, టీడీపీ, టీఆర్‌ఎస్‌, ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకులు తెలిపారు. నగరంలోని ప్రెస్‌భవన్‌లో ఆల్‌ ట్రేడర్స్‌ యూనియన్స్‌ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విదానాలపై తాము నిరంతరం పోరాడుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఐక్య ఉద్యమాలు చేయడానికి సహకారాన్ని అందించాలని కోరారు. ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర నాయకుడు తేజ్‌దీప్‌రెడ్డి, టీడీపీ నాయకుడు కళ్యాడపు ఆగయ్య మాట్లాడుతూ లేబర్‌కోడ్‌ రద్దుకోసం కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మేలో భాగస్వాములము అవుతామని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు యు శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్‌, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, రాఘవులు, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి జిందం ప్రసాద్‌, పార్వర్డ్‌ బ్లాక్‌ నాయకులు వంశీ, శంకర్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి యుగేందర్‌, మురళి తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.