క్రీడాకారులకు కప్‌ను అందజేస్తున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
- ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
కాల్వశ్రీరాంపూర్, మార్చి 27: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని మంగపేటలో నిర్వహించిన డీఎంఆర్ కప్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ యువకులు చదువుతోపాటు ఆటల్లో రాణించాలన్నారు. ప్రథమ బహుమతి పొందిన సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి జట్టుకు రూ.7777, రన్నర్‌గా నిలిచిన కూనారం జట్టుకు రూ.3333లను ఎమ్మెల్యే అందజేశారు. ఎంపీపీ నూనేటి సంపత్‌యాదవ్, సింగిల్‌విండో చైర్మన్లు గజవల్లి పురుషోత్తం, చదువు రామచంద్రారెడ్డి, సర్పంచ్ కూకట్ల నవీన్‌యాదవ్ పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.