ఉలవపాడు, మార్చి 5 : కరేడు నుంచి వయా ఉలవపాడు మీదగా అలగాయపాలెం వరకు తారురోడ్డు నిర్మాణం కోసం రూ.4.73 కోట్లు మంజూరైంది. ఇప్పటికే టెండర్లు కూడా పిలిచారు. కరేడు గ్రామంలోని పొల్లుగట్టు సంఘం నుంచి ఆకుతోట సంఘం వయా ఉలవపాడు మీదగా అలగాయపాలెం వరకు 10.7 కి.మీ తారురోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు.