వేలిముద్రలు 3 రకాలు... ఏ వేలిముద్ర మ్యాచ్ కాదు... ఇంతేకాకుండా...

ABN , First Publish Date - 2022-06-30T17:02:04+05:30 IST

వేలిముద్ర పని ఏమిటని ఎవరినైనా అడగగానే...

వేలిముద్రలు 3 రకాలు... ఏ వేలిముద్ర మ్యాచ్ కాదు... ఇంతేకాకుండా...

వేలిముద్ర పని ఏమిటని ఎవరినైనా అడగగానే స్మార్ట్‌ఫోన్ లాక్‌ని తెరవడానికని చెబుతారు. అయితే మాంచెస్టర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైన విషయాలు ఎంతో ఆసక్తిగొలుపుతున్నాయి. ఈ వేలిముద్రలు వస్తువులను పట్టుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు వేలిముద్ర పనితీరు ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది. శాస్త్రవేత్తలు వేలిముద్ర విధులను కూడా చెప్పారు. కొంతమంది శాస్త్రవేత్తలు అవి వేళ్ల సున్నితత్వాన్ని ప్రోత్సహిస్తాయని అంటారు.


అంటే మనం దేనినైనా తాకినప్పుడు, దానిని అనుభూతి చెందడానికి సహాయం చేస్తాయన్నమాట. కొలరాడో శాస్త్రవేత్తలు వేలిముద్రలపై బ్యాక్టీరియా ఉంటుందని తెలిపారు. చేతుల్లో బ్యాక్టీరియా పెరుగుదలలో వేలిముద్రల పాత్ర ఉందని, జెల్ సహాయంతో అతినీలలోహిత కాంతిలో దీనిని చూడవచ్చని తెలిపారు. వేలిముద్రలు ప్రత్యేకమైనవని అందరికీ తెలుసు, అయితే అవి మూడు రకాలు. వీటిని ఆర్చ్, లూప్, వర్ల్‌గా విభజించారు. శిశువులో వేలిముద్ర ఏర్పడటం అనేది ఆశిశువు తల్లి కడుపులో  ఉన్నప్పుడు ప్రారంభమవుతుంది. ప్రపంచంలోని ఏ వ్యక్తి వేలిముద్రలు మరొకరితో సరిపోలివుండవు. కవలల వేలిముద్రలు కూడా భిన్నంగా ఉంటాయి. 

Updated Date - 2022-06-30T17:02:04+05:30 IST