సందిగ్ధంలో ‘ఫ్యూచర్‌’ రుణ పునర్‌వ్యవస్థీకరణ

ABN , First Publish Date - 2021-04-23T06:35:11+05:30 IST

ఫ్యూచర్‌ గ్రూప్‌ రుణ పునర్‌ వ్యవస్థీకరణ ప్రణాళిక సందిగ్ధంలో పడింది. రిలయన్స్‌ రిటైల్‌కు ఫ్యూచర్‌ రిటైల్‌ ఆస్తులను అమ్మే ఒప్పందం సముచిత కాలంలో అమలు కాకపోతేనే ఈ రుణ పునర్‌ వ్యవస్థీకరణ ప్రణాళిక వర్తిస్తుందని...

సందిగ్ధంలో ‘ఫ్యూచర్‌’ రుణ పునర్‌వ్యవస్థీకరణ

న్యూఢిల్లీ: ఫ్యూచర్‌ గ్రూప్‌ రుణ పునర్‌ వ్యవస్థీకరణ ప్రణాళిక సందిగ్ధంలో పడింది. రిలయన్స్‌ రిటైల్‌కు ఫ్యూచర్‌ రిటైల్‌ ఆస్తులను అమ్మే ఒప్పందం సముచిత కాలంలో అమలు కాకపోతేనే ఈ రుణ పునర్‌ వ్యవస్థీకరణ ప్రణాళిక వర్తిస్తుందని రుణదాతల కన్సార్షియం స్పష్టం చేసినట్టు సమాచారం. మరోవైపు ఈ ఒప్పందం ఈ ఏడాది సెప్టెంబరుకల్లా పూర్తి కావాలని రిలయన్స్‌ గడువు విధించింది. అంటే ఈలోపు ఫ్యూచర్‌ - అమెజాన్‌ వివాదం ఒక కొలిక్కి రావాలి. లేకపోతే ఈ ఒప్పందానికి  రిలయన్స్‌ గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన సమావేశంలో ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన మూడు కంపెనీల రుణాల చెల్లింపు గడువు రెండేళ్లు పెంచేందుకు రుణదాతల కన్సార్షియం ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రిలయన్స్‌-ఫ్యూచర్‌ డీల్‌తో ముడిపెడుతోంది.  


Updated Date - 2021-04-23T06:35:11+05:30 IST