గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2021-09-14T02:35:33+05:30 IST
చ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గచ్చిబౌలి మసిద్ బండలో ద్విచక్ర వాహనంపై...
గచ్చిబౌలి: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గచ్చిబౌలి మసిద్ బండలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కృష్ణ (45) ను రేడిమిక్స్ లారీ ఢీకొట్టింది. కృష్ణ తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి కారణమైన రేడిమిక్స్ లారీ డ్రైవర్ను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.