కరపత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే ముస్తఫా తదితరులు
ఎమ్మెల్యే ముస్తఫా
గుంటూరు, మే 25: వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతోపాటు సమస్యలను తెలుసుకునేందుకే ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా పేర్కొన్నారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా బుదవారం 9వ డివిజన్ 19వ సచివాలయం పరిధిలోని యాద వబజారు, శ్రీకృష్ణనగర్‌లలో పర్యటించారు. ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ అర్హులకు తప్పనిసరిగా సంక్షేమ పథకాలు అందాల్సిందేననీ, ఏమైనా సమస్యలుంటే సచివాలయ సిబ్బంది పరిష్కరించాలని సూచించారు. సచివాలయ వ్యవస్థతో ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీల, కృష్ణబలిజ కార్పొరేషన్ చైౖర్మన్ కోలా భవానీ, వైసీపీ డివిజన్ ఇన్‌చార్జి రాచమంటి భాస్కర్, తోట ఆంజనేయులు, శృంగారపు శ్రీనివాసరావు పలువురు కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు .. హనుమాన్ జయంతి పురస్కరించుకొని పాతగుంటూరు ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే ముస్తఫా ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో చైర్మన్ జయప్రకాష్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, చెన్నంశెట్టి బాబు తదితరులున్నారు.