AP News: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అరెస్ట్

ABN , First Publish Date - 2022-09-11T17:42:52+05:30 IST

కంకిపాడు టోల్ గేట్ వద్ద ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హానాన్ని పోలీసులు అడ్డుకుని అతనిని అరెస్టు చేశారు.

AP News: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అరెస్ట్

అమరావతి (Amaravathi): టీడీపీ నేతలను గుడివాడ వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. కంకిపాడు టోల్ గేట్ వద్ద ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ (Gadde Rammohan) వాహానాన్ని పోలీసులు అడ్డుకుని అతనిని అరెస్టు చేసి, ఉంగుటూరు పీఎస్‌కు తరలించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu), లోకేష్‌ (Lokesh)లపై మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) చేసిన అనుచిత వ్యాఖ్యలపై గుడివాడ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసేందుకు వెళ్తున్న టీడీపీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ.. గుడివాడ వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. పామర్రులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పామర్రు చేరుకున్న కొందరు టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. 


చంద్రబాబు కుటుంబంపై అవాకులు చెవాకులు పేలితే ఆకాశంపై ఉమ్మేసినట్టేనని, అలాంటి వ్యాఖ్యల ద్వారా చరిత్ర హీనుడిగా నిలిచిపోతావని మాజీ మంత్రి కొడాలి నానికి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం కోశాధికారి శ్రీరాం తాతయ్య హితవు పలికారు. సంస్కారహీనంగా కుటుంబ స్త్రీలు, మహిళల పట్ల సభ్య సమాజం ఏమాత్రం సహించని వ్యాఖ్యలు చేయటం ఎవరు హర్షించరన్నారు. రాష్ట్ర తెలుగురైతు అధికారప్రతినిధి కొఠారు సత్యనారాయణప్రసాద్‌ మాట్లాడుతు, డిల్లీ లిక్కర్‌ స్కాంలో సీఎం జగన్‌ కుటుంబసభ్యుల పేర్లు వినిపిస్తుంటే ప్రజల దృష్టి మరల్చేందుకు కొడాలితో సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కన్నెబోయిన రామలక్ష్మి మాట్లాడుతూ, కొడాలి నానికి దమ్ముంటే తన రౌడీ అనుచరులు, పోలీసులు లేకుండా మహిళల వద్దకు వచ్చి అలాంటి మాటలు మాట్లాడాలని సవాల్‌ చేశారు. త్వరలోనే తెలుగు మహిళలు నాని తాట తీస్తారని హెచ్చరించారు. నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు కానూరి కిశోర్‌ మాట్లాడుతూ, కొడాలి ప్రెస్‌మీట్‌ అంటే ప్రజలు టీవీలు కట్టేసుకుంటున్నారని, ఇకనైనా సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలికారు. 

Updated Date - 2022-09-11T17:42:52+05:30 IST