స్టోరీ టెల్లింగ్‌ గాడ్జెట్‌ కిండ్లె వెల్లా

ABN , First Publish Date - 2021-06-19T05:30:00+05:30 IST

‘కిండ్లె వెల్లా’ పేరిట అమెజాన్‌ సరికొత్త స్టోరీ టెల్లింగ్‌ ఫీచర్‌ను వచ్చే నెలలో తీసుకువస్తోంది. సీరియల్‌ రూపంలో ఒకదాని తరవాత మరొక ఎపిసోడ్‌ చొప్పున రచయితలు తమ కథలను ఇందులో రాసుకోవచ్చు. అమెరికాలోని రీడర్లకు మాత్రమే ప్రస్తుతానికి

స్టోరీ టెల్లింగ్‌ గాడ్జెట్‌ కిండ్లె వెల్లా

‘కిండ్లె వెల్లా’ పేరిట  అమెజాన్‌ సరికొత్త స్టోరీ టెల్లింగ్‌ ఫీచర్‌ను వచ్చే నెలలో తీసుకువస్తోంది. సీరియల్‌ రూపంలో ఒకదాని తరవాత మరొక ఎపిసోడ్‌ చొప్పున రచయితలు తమ కథలను ఇందులో రాసుకోవచ్చు. అమెరికాలోని రీడర్లకు మాత్రమే ప్రస్తుతానికి ఈ అవకాశాన్ని పరిమితం చేశారు. కిండ్లే ఐఔస్‌ యాప్‌, అమెజాన్‌ డాట్‌కామ్‌ను ఇందుకోసం ఉపయోగించుకోవచ్చు. కిండ్లే డైరెక్ట్‌ పబ్లిషింగ్‌ సైట్‌లో ఈ మేరకు ఒక పోస్టును అమెజాన్‌ పెట్టింది. వారానికి ఒకసారి పబ్లిష్‌ చేసుకోవచ్చు. అలాగే కొన్ని ఎపిసోడ్లను మాత్రమే ఉచితంగా చదువుకునే అవకాశాన్ని రీడర్లకు కల్పిస్తారు. తదుపరి ఎపిసోడ్‌లను చదువుకునేందుకు  క్రెడిట్స్‌ను రీడర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.


రీడర్ల వ్యయం చేసిన మొత్తం నుంచి సగం అంటే 50 శాతం రచయితలకు దక్కుతుంది. 200 టోకెన్లకు క్రెడిట్స్‌ కింద 1.99 డాలర్ల రూపంలో లభిస్తుంది. ఒక టోకెన్‌ వందపదాలతో సమానం. ప్రతి ఎపిసోడ్‌ 500 నుంచి 6000 పదాల వరకు ఉంటుంది. ‘థంబ్స్‌ప్‌’తో అప్రిషియేషన్‌ ‘ఎఫ్‌ఎవి’తో వీక్లీ ఫేవరేట్‌ అని రీడర్లు తమ అభిమానాన్ని చూపించవచ్చు. అమెరికాలో ఈ ఫీచర్‌ను విడుదల చేసిన తరవాతే ఇతర దేశాలకు విస్తరించనున్నారు. అలాగే కిండ్లే ఈ రీడర్స్‌, కిండ్లే ఆండ్రాయిడ్‌ యాప్‌ను కూడా అమెజాన్‌ ఆరంభిస్తుందని భావిస్తున్నారు. 

Updated Date - 2021-06-19T05:30:00+05:30 IST