రాష్ట్రం గాడిలో పడాలంటే బాబు సీఎం కావాలి

Published: Tue, 16 Aug 2022 22:02:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 రాష్ట్రం గాడిలో పడాలంటే బాబు సీఎం కావాలి కరపత్రాలు పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులు ఇంటూరి, తదితరులు

  కందుకూరు, ఆగస్టు 16: అధోగతి పాలైన రాష్ట్రం తిరిగి గాడిలో పడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి  కావాలని  నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు.  బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 14వ వార్డులో మంగళవారం సాయంత్రం ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన నిత్యావసరాల ధరలు, విపరీతంగా పెరిగిపోయిన చార్జీలతో సామాన్యులు జీవించలేని దుస్థితి  వచ్చిందన్నారు. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు  మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దామా మల్లేశ్వరరావు, గుమ్మడి బ్రహ్మయ్య,  కాకుమాని మాల్యాద్రి, కల్లూరి కృష్ణమోహన్‌, గళ్లా రమణయ్య, జంపాల శ్రీకాంత్‌, ముచ్చు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.