హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ పనులపై సమీక్ష

Published: Tue, 15 Mar 2022 16:05:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon
హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ పనులపై సమీక్ష

ఢిల్లీ: హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ పనులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు  NHA, జీఎంఆర్ ప్రతినిధులు, మంత్రిత్వ శాఖ అధికారులు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. హైవేను ఆరులేన్లుగా మార్చడం ఆలస్యమవుతోందని ఎంపీ కోమటిరెడ్డి  అన్నారు. హైదరాబాద్- విజయవాడ హైవే విస్తరణ చేయకపోవడమే ప్రధాన సమస్య అని ఆయన పేర్కొన్నారు. అగ్రిమెంట్ ప్రకారం జీఎమ్మార్ ఆరులేన్లుగా హైవేను విస్తరించాలని ఆయన అన్నారు. కానీ నష్టం వచ్చిందనే కారణంతో రహదారి విస్తరణ పనులు చేయటం లేదని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తూనే ఉన్నానని ఆయన పేర్కొన్నారు. జీఎమ్మార్ కాదంటే, కేంద్రమే టెండర్లు వేసి హైవే విస్తరణ చేపట్టాలని ఆయన కోరారు. జీఎమ్మార్‌ను గడ్కరీ హెచ్చరించారని ఆయన పేర్కొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.