ప్రకృతి వనాలతో పర్యావరణ పరిరక్షణ

ABN , First Publish Date - 2021-04-23T04:28:00+05:30 IST

ప్రకృతి వనాలతో పర్యావరణ పరిరక్షణకు మార్గం ఏర్పడుతుందని జోగుళాంబ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు.

ప్రకృతి వనాలతో పర్యావరణ పరిరక్షణ
ప్రకృతి వనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

గద్వాల టౌన్‌, ఏప్రిల్‌ 22 : ప్రకృతి వనాలతో పర్యావరణ పరిరక్షణకు మార్గం ఏర్పడుతుందని జోగుళాంబ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు. గద్వాల పట్టణంలోని 17, 20వ వార్డుల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలను గురువారం ఆయన మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాల అభివృద్ధితో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావర ణాన్ని అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పల్లెలు, పట్టణాల్లో ప్రకృతివనాలను ఏర్పాటు చేయిస్తున్నారన్నారు. మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో నూ ప్రకృతివనాల ఏర్పాటు త్వరలోనే పూర్తవుతుం దన్నారు. దీంతో పాటు పట్టణ అభివృద్ధికి అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. అంతకు ముందు వారు ప్రకృతి వనంలోని జారుడు బండపై బాలికను ఎక్కించి ఆడించారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ బాబర్‌, కౌన్సిలర్లు త్యాగరాజు, మహేశ్వరి, నాగిరెడ్డి, నరహరి గౌడ్‌, కృష్ణ, శ్రీను, మహేష్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, జములమ్మ ఆలయ కమిటీ చైర్మన్‌ సతీష్‌, నాయకులు సాయిశ్యాంరెడ్డి, కోటేష్‌, తిమ్మన్న పాల్గొన్నారు..


దివ్యాంగులకు తోడ్పాటులో అగ్రస్థానం

దివ్యాంగులకు తోడ్పాటు అందించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. నెలసరి పింఛన్‌ను రూ.3000లకు పెంచడంతో పాటు, వైకల్యాన్ని బట్టి ఉపకరణాలు అందిస్తున్న ఘనత కేసీఆర్‌ ప్రభుత్వా నిదేనన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏడీఐపీ పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు ఆయన ఉపకరణాలు, కిట్లను అందించారు. 46 మందికి బ్యాటరీ ట్రై సైకిళ్ళు, చేతికర్రలు, స్ర్పింగ్‌ మోడల్‌ ఆసరా కర్రలను అందజేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, వైస్‌చైర్మన్‌ బాబర్‌, కౌన్సిలర్లు, కృష్ణ, నాగిరెడ్డి, నరహరిగౌడ్‌, శ్రీను, మహేష్‌, జిల్లా విద్యాశాఖాధికారి సుశీం దర్‌రావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-23T04:28:00+05:30 IST