గద్వాలను రీజనల్‌ పట్టణంగా అభివృద్ధి చేయాలి

ABN , First Publish Date - 2021-07-26T03:57:51+05:30 IST

వనరుల పరంగా సానుకూలత ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రాన్ని రీజనల్‌ నగరంగా అభివృద్ధి చేయాలని బహుజన రాజ్యసమితి కార్యద ర్శి వినోద్‌ కుమార్‌ కోరారు.

గద్వాలను రీజనల్‌ పట్టణంగా అభివృద్ధి చేయాలి
సమావేశంలో మాట్లాడుత్ను బీఆర్‌ఎస్‌ కార్యదర్శి వినోద్‌ కుమార్‌

 గద్వాల టౌన్‌, జూలై25: వనరుల పరంగా సానుకూలత ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రాన్ని రీజనల్‌ నగరంగా అభివృద్ధి చేయాలని బహుజన రాజ్యసమితి కార్యద ర్శి వినోద్‌ కుమార్‌ కోరారు.  ఆదివారం పట్టణంలోని స్మృతివనంలో నాయకులు వాల్మీ కి, సాయిసవరన్‌, కురుమన్న, బుద్ధిస్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా జిల్లా అధ్యక్షుడు కృష్ణల తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధిని రాజధాని కేంద్రా లు, మెట్రో నగరాలకే పరిమితం చేయడం వల్ల గ్రామీణ జిల్లాలకు వెనుకబాటుతనం తప్పడం లేదన్నారు. ఈ క్రమంలో రాష్ర్టానికి నలుమూల ఉన్న నాలుగు నగరాలను ఎంపిక చేసుకొని రీజినల్‌ నగరాలుగా అభివృద్ధి చేయాలని, అందులో గద్వాలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఆర్డీఎస్‌ ద్వారా పూర్తిస్థాయి (17.5 టీఎంసీలు) నీటిని వినియోగించుకోవాలని, తుంగభద్ర బోర్డులో గద్వాల జిల్లా కలెక్టర్‌ను సభ్యుడిగా చేర్చాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో మెడికల్‌, ఇంజనీరింగ్‌ కళాశాలను ఏర్పాటు చేయాల న్నారు. జిల్లాకు రూ.వెయ్యి కోట్లు కేటాయించి పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2021-07-26T03:57:51+05:30 IST