Advertisement

'గాలి సంపత్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Jan 24 2021 @ 13:29PM

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణ, స్క్రీన్‌ప్లేలో రూపొందుతోన్న చిత్రం 'గాలి సంపత్‌'. అనిల్‌ రావిపూడి కో డైరెక్ట‌ర్, రైట‌ర్, మిత్రుడైన ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ హీరో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా.. న‌ట‌కిరీటి డా. రాజేంద్రప్ర‌సాద్ గాలి సంప‌త్‌గా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ మూవీని అనీష్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నట్లుగా అనిల్ రావిపూడి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మార్చి 11న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సినిమా  ఫైనల్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.