సంజూ శాంసన్‌పై గంభీర్ ఫైర్!

ABN , First Publish Date - 2021-04-23T21:19:29+05:30 IST

నిలకడ లేమితో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌పై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు

సంజూ శాంసన్‌పై గంభీర్ ఫైర్!

నిలకడ లేమితో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌పై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గతంలో ఎన్నో సందర్భాల్లో శాంసన్‌కు మద్దతుగా నిలిచిన గంభీర్‌.. తాజాగా మాత్రం అతడిపై విమర్శలు చేశాడు. మెరుగైన క్రికెటర్ కాదలచుకుంటే శాంసన్ ఆటతీరు, ఆలోచనా విధానం మారాలన్నాడు. 


`సంజూ శాంసన్ ఆరంభంలో అదరగొడతాడు. ఆ తర్వాత ఇంకేమీ ఉండదు. ఒక మంచి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత వరుసగా నిరుత్సాహ పరుస్తుంటాడు. గ్రాఫ్ దారుణంగా పడిపోతుంటుంది. ఒక మంచి ప్లేయర్‌ గ్రాఫ్ అధ్వాన్నంగా ఉండకూడదు. రోహిత్, కోహ్లీ, ఏబీడీల గ్రాఫ్‌లు చూడండి. ఒక మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడితే దానిని అలాగే కొనసాగిస్తారు. తర్వాతి మ్యాచ్‌లలో కనీసం 30-40 పరుగులు చేస్తారు. శాంసన్ మాత్రం ఒక మ్యాచ్‌లో 80 పరుగులు చేస్తాడు. తర్వాతేమీ ఉండదు. అది కేవలం అతని మైండ్ సెట్ సమస్య. అతను చాలా మెరుగుపడాల`ని గంభీర్ అభిప్రాయపడ్డాడు. 

Updated Date - 2021-04-23T21:19:29+05:30 IST