బాలలకు ఆటలు, విద్యపై శిక్షణ: వినోద్‌

ABN , First Publish Date - 2020-07-07T07:55:20+05:30 IST

కరోనా నేపథ్యంలో పాఠశాలు నడిచే వాతావరణం లేనందున గ్రామాల్లోని బాలల విద్యా కేంద్రాల్లో పిల్లలకు ఆటలు, పాటలు, చదువులో ప్రత్యేక శిక్షణను ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బి. వినోద్‌కుమార్‌ సూచించారు. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు, యువత ముందుకు వచ్చి

బాలలకు ఆటలు, విద్యపై శిక్షణ: వినోద్‌

హైదరాబాద్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో పాఠశాలు నడిచే వాతావరణం లేనందున గ్రామాల్లోని బాలల విద్యా కేంద్రాల్లో పిల్లలకు ఆటలు, పాటలు, చదువులో ప్రత్యేక శిక్షణను ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బి. వినోద్‌కుమార్‌ సూచించారు. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు, యువత ముందుకు వచ్చి పనిచేయాలన్నారు. బాలల స్థితి, వారి విద్యావకాశాలపై సోమవారం ఎంవీ ఫౌండేషన్‌ నేషనల్‌ కన్వీనర్‌ వెంకట్‌రెడ్డి అధఽ్యక్షతన జరిగిన ఆన్‌లైన్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. పిల్లల కోసం పాఠ్యపుస్తకాలు, కథల పుస్తుకాలు, స్టేషనరీ వంటి వాటిని తాను ప్రధానోపాధ్యాయుతతో మాట్లాడి వాటిని పాఠశాల విద్యా కమిటీలకు అందజేసే చర్యల్ని తీసుకుంటానని ప్రకటించారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ ప్రొఫెసర్‌ శాంతా సిన్హా మాట్లాడుతూ.. బాలలకు ఆటలు, పాటలు, విద్య వంటి అంశాల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో యూనిసెఫ్‌ విద్యాధికారి సుకన్య, ఉపేందర్‌రెడ్డి, జగదీశ్వర్‌ రావు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-07T07:55:20+05:30 IST