క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న మునిసిపల్ చైర్‌పర్సన్ సుకేశిని
కొత్తకోట, జనవరి 24: పట్టణంలో మునిసిపల్ పాలక మండలి సభ్యులకు ఆదివారం క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను పురపాలక సంఘం చైర్‌సర్సన్ సుకేశిని ప్రారంభించి మాట్లాడారు. మునిసిపల్ ఎన్నికలు జరిగి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని సభ్యులకు వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేశామన్నారు. బాడ్మింటన్ పోటీలో ఖాజామైనోద్దీన్, తిరుపతి, రాంమోహన్‌రెడ్డి, మిషేక్, వశీంఖాన్, వహీద్‌అలీ, అధికారులు రమేష్ నాయక్, కురు మూర్తి పాల్గొన్నారు. విజేతలకు జనవరి 26న బహుమతులు ఇస్తామని కమిషనర్ తెలిపారు.