విడుదలకు సిద్ధమైన Gandharva

Published: Sun, 26 Jun 2022 16:13:30 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విడుదలకు సిద్ధమైన Gandharva

సందీప్ మాధవ్ (Sandeep Madhav), గాయత్రి సురేష్ (Gayathri Suresh) జంటగా తెరకెక్కిన తాజా చిత్రం 'గంధర్వ' (Gandharva). ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలి కాలంలో క్రేజీ ప్రాజెక్ట్‌గా పేరు తెచ్చుకున్న 'గంధర్వ' సినిమాను ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించగా, ఎస్ కె ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపనీస్ సమర్పిస్తోంది. ఇక ఈ సినిమాలో శీతల్, సాయి కుమార్, పోసాని, బాబు మోహన్, సురేష్ తదితరులు నటించారు. ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలు, ట్రైలర్ ఇప్పటికే సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. 

ఇక 'గంధర్వ' ప్రమోషన్స్‌లో ఈ సినిమా గురించి దర్శకుడు అప్సర్ (Director Apsar), హీరో సందీప్ మాధవ్ చెప్పిన విశేషాలు సినిమా మీద మంచి బజ్ ఏర్పడేలా చేశాయి. అద్భుతమైన కొత్త పాయింట్‌తో అందరి దృష్టిని ఆకర్షించడానికి దర్శకుడు అప్సర్ సిద్దమవుతున్నారు. జూలై 8 న థియేటర్లలో విడుదల కాబోతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీగా ఎత్తున విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంగీతం రాప్ రాక్ షకీల్ అందించారు. సినిమాటోగ్రఫీ జవహర్ రెడ్డి అందించగా, ఎడిటర్‌గా బసవా పైడి రెడ్డి వ్యవహరించారు.

ఈ మధ్యకాలంలో యంగ్ టాలెంట్ రూపొందిస్తున్న చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. కొందరు మంచి కథాంశాలతో అతి తక్కువ బడ్జెట్‌తో సినిమాలను తీసి అద్భుతమైన విజయాలను అందుకుంటున్నారు. అలాంటి చిత్రాలకు ఉదాహరణగా.. 'పెళ్లి చూపులు', 'కేరాఫ్ కంచెరపాలెం', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతిరత్నాలు' వంటివే. మరి ఈ కోవలో తాజాగా చిత్రం 'గంధర్వ' చిత్రం కూడా చేరుతుందని నమ్మకంగా చిత్ర బృందం ఉంది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International