TS News: బీజేపీ ఆఫీస్‌లో గాంధీ, శాస్ర్రీ జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2022-10-02T17:43:48+05:30 IST

నగరంలోని బీజేపీ కార్యాలయంలో మహాత్మా గాంధీజీ, లాల్‌బహదూర్ శాస్త్రీజీ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

TS News: బీజేపీ ఆఫీస్‌లో గాంధీ, శాస్ర్రీ జయంతి వేడుకలు

హైదరాబాద్: నగరంలోని బీజేపీ (BJP) కార్యాలయంలో మహాత్మా గాంధీజీ (Mahatma gandhi), లాల్‌బహదూర్ శాస్త్రీ (Lal bahadur shastri)జీ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ... రాజకీయాలతో పాటు.. సేవ చేయ‌టం బీజేపీకే సాధ్యమన్నారు. ప్రధాని జన్మదినం సందర్భంగా 15రోజుల పాటు సేవా పక్షం పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. చేనేత కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలని కోరారు. కోవిడ్ సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి ధైర్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. జైకిసాన్ నినాదాన్ని వెలుగులోకి తెచ్చిన నేత లాల్ బహదూర్ శాస్త్రి అని లక్ష్మణ్ అన్నారు. 


ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సునీల్ బన్సల్, లక్ష్మణ్, ఈటల, విజయశాంతి, వికేక్, గరికపాటి, జితేందర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొని ఇద్దరు మహనీయుల విగ్రహాలకు నివాళులర్పించారు. ఆపై స్వదేశీ వస్త్రాలను కొనుగోలు చేయాలన్న ప్రధాని మోదీ ఆదేశాలతో బీజేపీ నేతలు చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు.

Updated Date - 2022-10-02T17:43:48+05:30 IST