ఆందోళన బాట పడుతున్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది

ABN , First Publish Date - 2020-07-14T16:38:54+05:30 IST

హైదరాబాద్ : నగరంలోని గాంధీ ఆస్పత్రి సిబ్బంది ఒక్కొక్కరు ఆందోళన బాట పడుతున్నారు

ఆందోళన బాట పడుతున్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది

హైదరాబాద్ : నగరంలోని గాంధీ ఆస్పత్రి సిబ్బంది ఒక్కొక్కరు ఆందోళన బాట పడుతున్నారు. ఇప్పటికే తమను రెగ్యులరైజ్ చేయాలని అవుట్ సోర్సింగ్ నర్సులు డ్యూటీలకు హాజరు కావడం లేదు. మరోవైపు నాల్గవ తరగతి ఉద్యోగులు మంగళవారం నుంచి ఆందోళన బాట పడుతున్నారు. అయితే కొత్తగా తీసుకునే వాళ్లకు ఎక్కువ జీతం ఇవ్వటంతో.. తమకు జీతాలు పెంచాలంటూ నాలుగు రోజులుగా నర్సులు ఆందోళన బాట పట్టారు.


ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. జీతాలు పెంచుతామని హామీ ఇచ్చినా, 14 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. నాల్గవ తరగతి ఉద్యోగులు, స్వీపర్లు, వార్దు బాయ్‌లు, ఆయాలు ఆందోళన చేయనున్నట్లు ప్రకటించటంతో గాంధీలో గందరగోళం నెలకొంది. కరోనా రోగులు చికిత్స పొందుతున్న పరిస్థితుల్లో అందరూ విధులు బహిష్కరించి ఆందోళన చేస్తే రోగులకే ప్రమాదంగా మారే అవకాశం ఉంది.

Updated Date - 2020-07-14T16:38:54+05:30 IST