జిల్లాలో 19,20 తేదీల్లో గణేష్‌ నిమజ్జనం

Sep 18 2021 @ 02:18AM
సమవేశంలో మాట్లాడుతున్న పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌

భువనగిరిటౌన్‌, సెప్టెంబరు 17: గణేష్‌ నిమజ్జనం ఈనెల 19, 20 తేదీన నిర్వహించడానికి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ ఎం భగవత్‌ తెలిపారు. గణేష్‌ నిమజ్జనంపై  శుక్రవారం భువనగిరిలో నిర్వహించిన జిల్లా స్థాయి పోలీస్‌శాఖ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.  శోభాయాత్రలో డీజే, బాణసంచాను నిషేధించిటనట్లు తెలిపారు. శోభాయాత్రలో మద్యం తాగి వివాదాలకు కారణమయ్యేవారిని వీడియో తీయాలని, శాంతి భద్రతలకు ముప్పువాటిల్లే పరిస్థితుల్లో విధుల్లో ఉన్న అధికారులు అవసరమైన నిర్ణయం తీసుకుని అమల చేయాలని ఆదేశించారు. పోలీస్‌ కళాబృందం కూడా బందోబస్తులో పాల్గొంటుందన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పోలీసు సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. బందోబస్తులో ఉన్న పోలీసులకు తాగునీరు, భోజనం తదితర ఏర్పాట్లను స్థానిక పోలీసులు ఏర్పాటు చేయాలన్నారు.  అడీషనల్‌ ఎస్పీ ఎన్‌.భుజంగరావు మాట్లాడుతూ పోలీస్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు. డీసీసీ కె.నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సుమారు 3600 విగ్రహాలను ప్రతిష్ఠించగా 2600 మండపాలను నిర్వహ కులు ఆన్‌లైన్‌లో నమోదు  చేశామన్నారు.  జిల్లా వ్యాప్తంగా నిమజ్జనానికి 395 చెరువులు, కుంటలు అనువుగా ఉండగా తొమ్మిది పెద్ద చెరువుల్లో మాత్రమే భారీ విగ్రహాల నిమజ్జనానికి ఆర్‌అండ్‌బీ శాఖ సాకారంతో క్రేన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో  ట్రాఫిక్‌  డీసీపీ  శ్రీనివాస్‌ రావు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌ ఏసీపీలు సాయిరెడ్డి వెంకట్‌రెడ్డి, కె.నర్సింహారెడ్డి, ఎన్‌.ఉదయ్‌రెడ్డి సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

భువనగిరి, బీబీనగర్‌ చెరువుల పరిశీలన

భువనగిరిటౌన్‌, బీబీనగర్‌: భువనగిరి పెదచెరువు, బీబీనగర్‌లో చెరువు ప్రాంతాల్లో గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లను భువనగిరి మునిసిపల్‌ చెర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, మునిసిపల్‌ కమిషనర్‌ ఎం.పూర్ణచందర్‌తో కలిసి  సీపీ మహేష్‌ భగవత్‌ భువనగిరి పెద్ద చెరువులో గణే ష్‌ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన సమయాల్లో  భక్తులు ప్రమాదాల బారిన పడకుండా భారీ కేడ్లు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచిం చారు. రెవెన్యూ అధికారులు,  పోలీసులు సమన్వయం చేసుకుంటూ అవస రమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయన వెంట డీసీపీ నారాయ ణరెడ్డి, ఏసీపీ వెంకట్‌రెడ్డి, సీఐ జానయ్య, తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌, స్థానిక నాయకులు మల్లగారి శ్రీనివాస్‌, పంచాయతీ కార్య దర్శి శ్రీనివాస్‌ ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.Follow Us on: