TS News: వరంగల్ ట్రై సిటీస్ పరిధిలో 15 ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనం

ABN , First Publish Date - 2022-09-09T14:18:56+05:30 IST

జిల్లాలో గణేష్ నిమజ్జనం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వరంగల్ ట్రై సిటీస్ పరిధిలో 15 ప్రాంతాల్లో గణేశ్ నిమజ్జనానికి ఏర్పాటు చేశారు.

TS News: వరంగల్ ట్రై సిటీస్ పరిధిలో 15 ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనం

వరంగల్: జిల్లాలో గణేష్ నిమజ్జనం (Ganesh immersion) అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వరంగల్ ట్రై సిటీస్ పరిధిలో 15 ప్రాంతాల్లో గణేశ్ నిమజ్జనానికి ఏర్పాటు చేశారు. నిమజ్జనం నిర్వహిస్తున్న ప్రాంతంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ క్రెయిన్స్, తెప్పలు, రెస్క్యూ టీమ్స్‌ను అధికారులు సిద్ధం చేశారు. మూడు వేల మంది పోలీసులతో నిమజ్జనానికి బందోబస్తు నిర్వహించారు. భారీ విగ్రహాలను చిన్న వడ్డేపల్లి, ఉర్సు చెరువు, కోట చెరువు, బంధం చెరువుకు తరలించనున్నారు. సిద్ధేశ్వర గుండంలో కేవలం నాలుగు ఫీట్ల విగ్రహాలకు మాత్రమే నిమజ్జనానికి అనుమతి ఇవ్వనున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ దారి మళ్లించారు. 

Updated Date - 2022-09-09T14:18:56+05:30 IST