కార్మికులను మోసం చేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: జాయింట్ సీపీ విశ్వప్రసాద్

ABN , First Publish Date - 2022-02-02T22:11:46+05:30 IST

పని కోసం ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చిన కార్మికులను మోసం చేస్తున్న ఓ

కార్మికులను మోసం చేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: జాయింట్ సీపీ విశ్వప్రసాద్

హైదరాబాద్: పని కోసం ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చిన కార్మికులను మోసం చేస్తున్న ఓ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ జోన్ జాయింట్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం హైదరాబాద్ సిటీలో కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు, ఆటో డ్రైవర్లు కుమ్మక్కై ఓ గ్యాంగ్‌లాగా ఏర్పడి అమాయక ప్రయాణికులను దోచుకుంటున్నారన్నారు. బతుకు దెరువు కోసం ఇతర రాష్ట్రాలు ప్రాంతాల నుంచి వచ్చే వారిని ఈ గ్యాంగ్ టార్గెట్ చేస్తోందన్నారు. సిటీ రూట్ తెలియని వాళ్ళను బెదిరించి ఆటోలో  ఎక్కించుకుని తిప్పి వారిని దోచుకుంటున్నారని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎనిమిది కార్మికులు  ఈ నెల 29 న కరీంనగర్ లో ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పని కోసం వచ్చారని ఆయన పేర్కొన్నారు. అయితే ముందుగా వీరంతా ఎంజీబీఎస్‌లో దిగాలన్నారు. కానీ  ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం దగ్గర అర్ధరాత్రి 12 గంటలకు  దిగారన్నారు. తమకు సిటీ తెలియక పోవడంతో అదే అంబేడ్కర్ విగ్రహం ఉన్న ప్రాంతాన్ని ఎంజీబీఎస్‌ అనుకున్నారని ఆయన తెలిపారు.


సరిగ్గా ఆ సమయంలో రెండు ఆటోల్లో వచ్చిన నిందితులు కరీంనగర్‌కు తాము టికెట్స్ ఇప్పిస్తామని బలవంతంగా ఆటోలో ఎక్కిచుకున్నారన్నారు. పక్కన ట్రావెల్స్ ఏజెన్సీ ఉందంటూ ఎక్కించుకున్నారన్నారు. సుమారు రెండు మూడు గంటలు సిటీలో తిప్పి మళ్ళీ వారిని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ఉన్న సలాం నమస్తే ట్రావెల్స్ వద్ద దింపారని ఆయన తెలిపారు. మీ దగ్గర కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్, నెగిటివ్ సర్టిఫికెట్ లేకపోతే మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారని, కోవిడ్ సర్టిఫికెట్‌ను సలాం నమస్తే ట్రావెల్ ఏజెన్సీ వారు  చేస్తారని బెదిరించారన్నారు. అక్కడే వారిని నిర్బంధించి వారి వద్ద ఉన్న డబ్బు లాక్కున్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం మధ్యప్రదేశ్ కార్మికులను తీసుకుని వెళ్లి ఆరాంగర్ వద్ద వదిలి పెట్టారన్నారు.


ముందుగా కార్మికుల్లో ఓ వ్యక్తి తాము దిగిన చోటు లొకేషన్‌ను షేర్ చేసి తాము క్కడే ఉంటున్నామని లేబర్ లీడర్‌కు పంపాడన్నారు. ఈ ఘటన అనంతరం పోలీసులకు ఫిర్యాదు అందిందన్నారు. దీంతో కార్మికులు ప్రయాణించిన ట్రావెల్ ఏజెన్సీని, ఆటో డ్రైవర్లను విచారించామన్నారు. దాని ఆధారంగా ఎనిమిది మంది నేరస్తులను అరెస్ట్ చేసామని ఆయన తెలిపారు. వీరిపై 395 డెకాయిట్ కింద కేసు నమోదు చేశామన్నారు. నగరంలో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న మరొకొన్ని ముఠాలను గుర్తించామని, వారిపై కూడా యాక్షన్ తీసుకోబోతున్నామని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2022-02-02T22:11:46+05:30 IST