
''చెయ్ చూశావా.. ఎంత రఫ్‌గా ఉందో.. రఫ్ ఆడించేస్తానేమనుకున్నావో..'' ఈ డైలాగ్ ఇప్పటికీ ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉంటుందనడంతో అతిశయోక్తి ఉండదేమో. 1991లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గ్యాంగ్‌లీడర్'. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవిని మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఇందులో పాటలు, డైలాగ్స్, స్టోరీ, స్కీన్‌ప్లే.. ఒక్కటేమిటి.. ప్రతీది హైలెట్ అని చెప్పవచ్చు. రఘుపతి, రాఘవ, రాజారామ్ అనే ముగ్గురు అన్నదమ్ముల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. రఘుపతిగా మురళీమోహన్, రాఘవగా శరత్‌కుమార్, రాజారామ్‌గా మెగాస్టార్ చిరంజీవి నటించారు. ఈ ముగ్గురు దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఒకే చోట కనిపిస్తే.. ఆ మెగా మూమెంట్ ఎలా ఉంటుంది?. ఊహిస్తుంటేనే ఏదో గొప్ప అనుభూతి వస్తుంది కదా!. అలాంటిది నిజంగానే ఆ ముగ్గురు అనుకోకుండా కలుసుకుని.. తమ మెమరీస్‌ని గుర్తు చేసుకున్నారంటే.. ఆ క్షణం వారు ముగ్గురు ఎంత ఎగ్జయిట్‌మెంట్‌కి లోనై ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
వీరు ముగ్గురు రామోజీ ఫిల్మ్ సిటీలో వేరు వేరు షూటింగ్లలో పాల్గొంటూ అనుకోకుండా కలుసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోన్న 'ఆచార్య' షూటింగ్లో చిరంజీవి, ఆర్కే మీడియా వారి చిత్ర షూటింగ్లో మురళీమోహన్, మణిరత్నం తెరకెక్కిస్తోన్న చిత్ర షూటింగ్లో శరత్‌కుమార్ పాల్గొంటున్నారు. ఇలా ఈ ముగ్గురు అనుకోకుండా కలుసుకోవడంతో.. ఒక్కసారిగా 'గ్యాంగ్‌లీడర్' జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అంతేకాదు ముగ్గురు కలిసి ఫొటోలు తీయించుకుని.. వాటిని అభిమానులకు కూడా పంపించారు. ఈ మూమెంట్‌ని మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఎంజాయ్ చేశారని, వెంటనే ఫొటోగ్రాఫర్‌ని పిలిపించి.. ఈ సంతోషాన్ని అభిమానులకు కూడా పంచాలని ఫొటోలు తీయించారని తాజాగా మురళీమోహన్ తెలిపారు.