ఆ ‘జెలసీ గ్యాంగ్’ నేను ఫెయిలవ్వాలని కోరుకుంది: రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-04-27T00:27:32+05:30 IST

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి యూకేకు చెందిన ‘ద గార్డియన్’ న్యూస్ పేపర్‌కు ఇచ్చిన

ఆ ‘జెలసీ గ్యాంగ్’ నేను ఫెయిలవ్వాలని కోరుకుంది: రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి యూకేకు చెందిన ‘ద గార్డియన్’ న్యూస్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియాలో ఓ ‘గ్యాంగ్’ ఉందని,  తానెప్పుడూ ఓడిపోవాలని అది కోరుకుందని అన్నాడు. అయితే, తన తోలు (చర్మం) మందమని కాబట్టి ఎవరూ ఏమీ చేయలేకపోయారని అన్నాడు.  ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు రాబర్ట్ కీ క్రికెట్ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను రవి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. అసూయతో రగిలిపోయే వారిని ఎదుర్కోవాలంటే మన చర్మం డ్యూక్ బాల్ కంటే గట్టిగా ఉండాలని కీ చెప్పేవాడని పేర్కొన్నాడు.


తనకు లెవల్ వన్, లెవల్ టు వంటి కోచింగ్ బ్యాడ్జెస్ ఏమీ లేకున్నా నేరుగా ప్రధాన కోచ్ పదవి వరించడం కొందరికి నచ్చలేదని రవి అన్నాడు. ఇండియా లాంటి దేశాల్లో జెలసీ లేదంటే గ్యాంగ్ ఉంటుందని, అదెప్పుడూ నువ్వు ఓడిపోవాలనే కోరుకుంటుందన్నాడు. అయితే, తన చర్మం చాలా దళసరిదని, ఎంత మందమంటే డ్యూక్స్ బాల్ కంటే మందంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అది చాలా దృఢంగా ఉంటుందని అన్నాడు. కాబట్టే తాను అలాంటివి పట్టించుకోలేదని అన్నాడు.    

Updated Date - 2022-04-27T00:27:32+05:30 IST