ఘనంగా గంగమ్మ గౌరమ్మల నిమజ్జనం

ABN , First Publish Date - 2021-12-06T05:27:03+05:30 IST

మండలంలో గంగమ్మ, గౌరమ్మల నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది.

ఘనంగా గంగమ్మ గౌరమ్మల నిమజ్జనం

గిద్దలూరు, డిసెంబరు 5 : మండలంలో గంగమ్మ, గౌరమ్మల నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది.  పట్టణంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో, షరాఫ్‌ బజారులోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో, శ్రీపాతాళ నాగేశ్వరస్వామి దేవాలయంలో, శ్రీవేణుగోపాలస్వామి దేవాలయంలో, శ్రీకాళికాంబ, కనకదుర్గ దేవాలయాలతోపాటు పలు దేవాయాలలో కార్తీక మాసం సందర్భంగా 30 రోజులపాటు గంగమ్మ, గౌరమ్మకు ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. చివరి రోజు అయిన ఆదివారం ఆయా దేవస్థానాల కమిటీల ప్రతినిధుల ఆధ్వర్యంలో గంగమ్మ, గౌరమ్మ నిమజ్జనం సగిలేరు నదిలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్యవైశ్య, యాదవ కార్తీక వనభోజనాలను నిర్వహించారు. ఆయా దేవస్థానాల కమిటీల ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-06T05:27:03+05:30 IST