గంగమ్మా.. కరుణించవమ్మా..!

ABN , First Publish Date - 2022-05-25T05:25:56+05:30 IST

గంగమ్మ తల్లీ.. మమ్ములను కరుణించవమ్మా..! అంటూ మదనపల్లె పట్టణంలోని బాలాజీనగర్‌లో ఉన్న ఎర్రదొడ్డిగంగమ్మ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

గంగమ్మా.. కరుణించవమ్మా..!
మదనపల్లె జాతరలో పాల్గొన్న భక్తులు

మదనపల్లె అర్బన్‌ మే24: గంగమ్మ తల్లీ.. మమ్ములను కరుణించవమ్మా..! అంటూ మదనపల్లె పట్టణంలోని బాలాజీనగర్‌లో ఉన్న ఎర్రదొడ్డిగంగమ్మ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.   ఎర్రదొడ్డిగంగమ్మ జాతర ను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలకంరించి భక్తులకు దర్శనం కల్పించారు. తెల్లవారుజామున కాలనీలోని మహిళలు భక్తిశ్రద్ధలతో చీరతో కూడిన సారెను గంగమ్మకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దీలు బోనాలు మోశారు.  పగలు అమ్మవారికి ఏటలను సమర్పించి బంధుమిత్రులతో కలిసి విందు భోజనాలు చేశారు. బుధవారం మధ్యాహ్నం అమ్మవారిని ప్రత్యేకవాహనంలో ఊరేగింపు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త లక్ష్మన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. 

   

తంబళ్లపల్లెలో తిరుణాల

తంబళ్లపల్లె, మే 24: తంబళ్లపల్లె మండలం ఆర్‌ఎన్‌తాండాలో వెలసిన మారెమ్మ అమ్మవారి తిరుణాల మంగళవారం వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులు భక్తి శ్రద్థఽలతో అమ్మవారికి దీలూ, బోణాలూ సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం రాత్రి విద్యుత్‌ దీపాలతో అలం కరించిన చాందినీ బండ్లు కట్టి కోలాటలు, చెక్క భజనలు నడుమ ఆల యం చుట్టూ తిప్పి మొక్కులు తీర్చుకున్నారు.  

నేడు, రేపు కోటకొండ గంగమ్మ ఆలయంలో..

తంబళ్లపల్లె మండల కేంద్రానికి సమీపంలోని సంతోపులో వెలసిన కోట కొండ గంగమ్మ జాతర బుధ, గురువారాల్లో వైభవంగా నిర్వహించను న్నట్లు తంబళ్లపల్లె సర్పంచ్‌ నీలూఫర్‌ మైనుద్దీన్‌, పరుషతోపు సర్పంచ్‌ పార్వతమ్మ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం, తంబళ్లపల్లె చుట్టూ పక్కల గ్రామాల మహిళలు అమ్మవారికి దీలూ, బోణాలూ సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని రాత్రికి చాందినీ బండ్ల మెరవణి ఉంటుందన్నారు. గురువారం పగలు తిరుణాల నిర్వహించనున్నట్లు తెలిపారు.  

రామసముద్రంలో  మారెమ్మ జాతర 

రామసముద్రం మే 24: మండలంలోని పెద్దకురప్పల్లి పంచాయతీలోని తిరుమలరెడ్డిపల్లెలో వెలసిన మారెమ్మ జాతర మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేకపూజలు చేశా రు. మారెమ్మకు మహిళలు బోనాలను భక్తిశ్రద్ధతో చెల్లించారు భక్తులతో అమ్మవారి ఆలయం కిటకిటలాడింది. చుట్టుపక్కలున్న ఆరు దేవాల యాల గ్రామదేవతలకు అనగా బోయకొండ గంగమ్మ, సత్యమ్మ, నరిడే మ్మ, సప్పలమ్మ, నల్లగంగమ్మ, నడివీధి గంగమ్మలకు బోనాలు మోసి మొ క్కులు తీర్చుకున్నారు. వర్షాలు బాగా కురవాలని, పంటలు పండి రైతులు సుభిక్షంగా ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నారు.  

పీలేరు రౌద్రాల అంకాలమ్మ ఆలయంలో..

పీలేరు, మే 24: పీలేరు పట్టణంలో వెలసిన రౌద్రాల అంకాలమ్మ (గం గమ్మ) అమ్మవారి జాతర రెండో మంగళవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే కలశస్థాప న, అఖండ గీతాలాపాన, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఛైర్మన్‌ మాధవరం భాస్కర్‌రెడ్డి,  ధర్మకర్తలు నాగమణి, అనూరాధ, కృష్ణప్ప, రాజేశ్వరి, డాక్టర్‌ సహదేవయ్య, సురేష్‌ , కార్యనిర్వాహణాధికారి రవీంద్రరాజు, అర్చకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-25T05:25:56+05:30 IST