
ఏపీ (శ్రీ సత్య సాయి జిల్లా): శ్రీ సత్య సాయి జిల్లాలో బాలికపై (Rape attempt) అత్యాచారయత్నం జరిగింది. నల్లమాడ మండలంలో ఆరో తరగతి చదువుతున్న బాలిక పచ్చిగడ్డి కోస్తుండగా..తమిళనాడుకు చెందిన కార్మికులు బాలికను క్వారీలోకి ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. కొడవలితో ప్రతిఘటిస్తూ బాలిక గట్టిగా కేకలు వేయడంతో తల్లి బాలిక వద్దకు చేరుకుని.. కార్మికులపై రాళ్లు రువ్వుతూ బాలికను కాపాడింది. అనంతరం విషయాన్ని కుటుంబసభ్యులు, గ్రామస్థులకు చెప్పడంతో వారు ఘటనా ప్రాంతంలో గాలించారు. క్వారీలో ఉన్న తమిళనాడుకు చెందిన ఇద్దరు కార్మికులను గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. మరో కార్మికుడు పరారీలో ఉన్నాడు.