Ganguly: ఒక్క ట్వీట్‌తో బాంబు పేల్చిన గంగూలీ.. దాదా చేసిన ఆ ట్వీట్‌లో ఏముందంటే..

ABN , First Publish Date - 2022-06-01T23:55:23+05:30 IST

ట్విట్టర్ వేదికగా టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశారు. ఎక్కువ మంది ప్రజలకు సాయపడాలనే ఉద్దేశంతో..

Ganguly: ఒక్క ట్వీట్‌తో బాంబు పేల్చిన గంగూలీ.. దాదా చేసిన ఆ ట్వీట్‌లో ఏముందంటే..

కోల్‌కత్తా: ట్విట్టర్ వేదికగా టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశారు. ఎక్కువ మంది ప్రజలకు సాయపడాలనే ఉద్దేశంతో తానొక నిర్ణయానికి వచ్చినట్లు దాదా ట్వీట్ చేశాడు. తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టబోతున్నానని, ఇప్పుడు కూడా మీ అందరి మద్ధతు ఉంటుందని ఆకాంక్షిస్తున్నానని పోస్ట్ పెట్టాడు. ఇప్పటి వరకు క్రికెట్‌కు సేవ చేశానని, ప్రజలకు సేవ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని గంగూలీ చేసిన ట్వీట్‌తో రాజకీయాల్లోకి రావాలని దాదా నిర్ణయించుకున్నట్లు చెప్పకనే చెప్పినట్లయింది. త్వరలో సౌరవ్‌ గంగూలీ బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. అమిత్‌ షాతో దాదా టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. గత నెల అమిత్‌షాతో గంగూలీ ప్రత్యేకంగా సమావేశం కావడం, అమిత్‌షా తనయుడు జయ్‌షాతో దాదాకు ఉన్న సాన్నిహిత్యం, బీసీసీఐ సెక్రటరీగా జయ్‌షా ఉండటం, బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ కొనసాగుతుండటం.. ఈ పరిణామాలన్నీ గంగూలీ బీజేపీలో చేరబోతున్నాడనే వార్తలకు బలం చేకూర్చుతున్నాయి.



రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వగానే బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకునే యోచనలో గంగూలీ ఉన్నట్లు సమాచారం. గంగూలీ బీజేపీలో చేరితే రాజ్యసభ సభ్యత్వం కూడా ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గంగూలీ తృణముల్‌లో చేరతారనే ప్రచారం కూడా జరుగుతోంది. పొలిటికల్ ఎంట్రీపై పరోక్షంగా ట్వీట్ చేసిన దాదా ఏ పార్టీలో చేరబోతున్నాడో చెప్పి ఉంటే ఈ ప్రచారాలకు తావుండక పోయేది. త్వరలోనే ఆ విషయాన్ని కూడా దాదా వెల్లడించనున్నట్లు తెలిసింది. దాదాపుగా దీదీ పార్టీలో దాదా చేరకపోవచ్చనే రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బీజేపీతో గంగూలీకి కొన్నేళ్లుగా సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో గంగూలీ బీజేపీలోనే చేరే అవకాశాలే మెండుగా ఉన్నాయని దాదా ట్వీట్‌ను నిశితంగా పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Updated Date - 2022-06-01T23:55:23+05:30 IST