Advertisement

కొబ్బరి మొక్కలచాటున గంజాయి తరలింపు

Dec 3 2020 @ 00:43AM
గంజాయితో పట్టుబడ్డ లారీ ఇదే.. పక్కన నిందితులు వాడిన కారు

200 కిలోల గంజాయితో పాటు2 వాహనాలు పట్టివేత

ఏడుగురు అంతర్‌ రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్‌

పట్టుకున్న గంజాయి విలువ రూ.24 లక్షలు

విశాఖపట్నం నుంచి ముంబైకి రవాణా 

విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి 

సోన్‌, డిసెంబరు 2 : కొబ్బరిమొక్కల చాటున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు చాక చక్యంగా పట్టుకున్నారు. విశాఖపట్నం నుండి ముంబైకి అక్రమ గంజాయి వ్యాపారం చేస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్‌ చేశారు. బుధవారం సాయంత్రం మండ ల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని గంజాల్‌ టోల్‌ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీల్లో భాగంగా లారీ నెంబరు ఎంహెచ్‌04 పీఎఫ్‌ 1514 కారునెంబరు ఎంహెచ్‌ 13 సీయూ 4620 రెండు వాహనాలను తనిఖీ చేయగా కొబ్బరి మొక్కలను అనకపల్లి నుండి మహారాష్ట్రలోని జాల్‌గావ్‌కు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. అనుమానం రావడంతో లారీలో తనిఖీ చేయగా లారీలో 5 పెద్దసంచులు కారులో 2 పెద్ద గంజాయితో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. 100 గంజాయి ప్యాకెట్లలో 200 కిలోల గంజాయి పట్టుకున్నట్లు తెలిపారు. అక్రమ గంజాయి వ్యాపారం ఎవరికి అనుమానం రాకుం డా కొబ్బరి మొక్కలు పూలమొక్కల చాటున వ్యాపారం చేస్తున్నట్లు చెప్పారు. విశాఖ పట్నంలోని అనకపల్లి ఏజెన్సీ ప్రాంతంలో తక్కువ ధరకు కొనుగోలు చేసి ముంబై పట్టణంలో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. వాహనంతో పాటు ముఠాసభ్యులను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. అరెస్ట్‌ అయినవారు మహారాష్ట్రలోని ఔరంగబాద్‌ ప్రాంతంకు చెందిన అర్మీన్‌ చింద పటేల్‌, షేక్‌ ఆసీఫ్‌, ఆరీఫ్‌ సబ్దార్‌పటేల్‌, ముబారక్‌ఖాన్‌, బగుల్‌సతీష్‌, మొహమ్మద్‌ మీర్జా, సత్యనారాయణ శర్మలు ఉన్నట్లు తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.24 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ వివరించారు. గంజాయిని బయట వ్యక్తులకు రిటైల్‌గా అమ్మితే కోటి రూపాయల వరకు వస్తుందని తెలిపారు. 7 నిందితులను విచారణ నిమిత్తం గంజాయి వెనుక సూత్రదారులు బయటపడుతారని చెప్పా రు. గంజాయి పట్టుకున్న పోలీసులను డీఎస్పీ అభినందించారు. ఈ విలేకర్ల సమావేశంలో సీఐ జీవన్‌రెడ్డి, సోన్‌ మామడ ఎస్సై ఆసీఫ్‌, వినయ్‌లతో పాటు పోలీసులు ఉన్నారు. 

Follow Us on:
Advertisement