గంజాయి రవాణా లారీ పట్టివేత

ABN , First Publish Date - 2021-04-24T05:09:25+05:30 IST

విశాఖ జిల్లా నుంచి తెలంగాణకు లారీలో తరలి వెళ్తున్న గంజాయిని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవికిరణ్‌ పట్టుకున్నారు.

గంజాయి రవాణా లారీ పట్టివేత
గంజాయి దింపుతున్న పోలీసులు

జంగారెడ్డిగూడెం, ఏప్రిల్‌ 23 : విశాఖ జిల్లా నుంచి తెలంగాణకు లారీలో తరలి వెళ్తున్న గంజాయిని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవికిరణ్‌ పట్టుకున్నారు. కూరగా యల ట్రేలు, గోనె సంచులలో నింపి గం జాయి రవాణా చేస్తున్నట్టు అందిన సమా చారం మేరకు డీఎస్పీ రవికిరణ్‌ శుక్రవారం సాయంత్రం బైపాస్‌ రోడ్డులో అడ్డుకుని పరిశీలించారు. ట్రేల కింద భాగంలో బస్తాల్లో గంజాయి ఉన్నట్టు గుర్తించి లారీని, గంజాయి బస్తాలతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు రావలసి ఉంది.

Updated Date - 2021-04-24T05:09:25+05:30 IST