స్వచ్ఛంద పదవీ విరమణకు గంటా మోహన్‌ దరఖాస్తు

ABN , First Publish Date - 2022-10-02T05:21:06+05:30 IST

రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు గంటా మోహన్‌ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేశారు.

స్వచ్ఛంద పదవీ విరమణకు గంటా మోహన్‌ దరఖాస్తు
డీఈవో పురుషోత్తంకు పదవీ విరమణ దరఖాస్తును అందజేస్తున్న గంటా మోహన్‌

చిత్తూరు (సెంట్రల్‌), అక్టోబరు 1: రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు గంటా మోహన్‌ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేశారు. ఈ మేరకు దరఖాస్తును శనివారం డీఈవో పురుషోత్తంకు సమర్పించారు. ఎస్టీయూ ఉమ్మడి చిత్తూరు జిల్లా కౌన్సిల్‌ సమావేశం తీర్మానంతో పాటు తూర్పు రాయలసీమ ఎస్టీయూ నాయకుల అభిప్రాయం మేరకు శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమం కోసం తన 18 సంవత్సరాల సర్వీసును త్యాగం చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు దేవరాజులు, నాయకులు మదన్‌మోహన్‌, పరందామతో కలిసి దరఖాస్తును డీఈఓకు సమర్పించారు.

Updated Date - 2022-10-02T05:21:06+05:30 IST