గరం మసాలా

ABN , First Publish Date - 2022-02-03T19:00:12+05:30 IST

జీలకర్ర- అర కప్పు, ధనియాలు- అర కప్పు, దాల్చిన చెక్క- పది, లవంగాలు- రెండు స్పూన్లు, ఎండు మిర్చి- మూడు, యాలకులు- 20, బిర్యానీ ఆకు- పది, శొంఠి - రెండు స్పూన్లు, మిరియాలు- రెండు స్పూన్లు, షాజీర- రెండు స్పూన్లు.

గరం మసాలా

కావలసిన పదార్థాలు: జీలకర్ర- అర కప్పు, ధనియాలు- అర కప్పు, దాల్చిన చెక్క- పది, లవంగాలు- రెండు స్పూన్లు, ఎండు మిర్చి- మూడు, యాలకులు- 20, బిర్యానీ ఆకు- పది, శొంఠి - రెండు స్పూన్లు, మిరియాలు- రెండు స్పూన్లు, షాజీర- రెండు స్పూన్లు.


తయారుచేసే విధానం: పైన పేర్కొన్న సుగంధ ద్రవ్యాలన్నిటినీ ఓ ప్లేటులో వేసి రెండు మూడు రోజులు ఎండలో పెట్టాలి. ఆ తరవాత పాన్‌లో ధనియాలు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే ఒక్కో సుగంధ ద్రవాన్ని వేయించుకుని చల్లారాక మిక్సీలో పడితే గరం మసాలా రెడీ. చల్లారిన పొడిని సీసాలో పోసి అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు.

Updated Date - 2022-02-03T19:00:12+05:30 IST