శ్రవణానందంగా వీణా కచేరి

ABN , First Publish Date - 2021-04-18T05:11:49+05:30 IST

స్థానిక గార్డెన్స్‌ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ఆధ్వర్యంలో శనివారం జరిగిన వీణా కచేరి ప్రేక్షకులను అలరింపజేసింది.

శ్రవణానందంగా వీణా కచేరి
కచేరి చేస్తున్న వైష్ణవి నిహారిక

గుంటూరు(సాంస్కృతికం), ఏప్రిల్‌ 17: స్థానిక  గార్డెన్స్‌ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ఆధ్వర్యంలో శనివారం జరిగిన వీణా కచేరి ప్రేక్షకులను అలరింపజేసింది. విద్యార్థులు వైష్ణవి, నిహారిక, హేమకిరణ్‌ అన్నమాచార్య, త్యాగరాజ స్వామి విరచిత పలు కీర్తనలను వీణపై పలికించారు.  సూర్య మృదంగంపై వాద్య సహకారం అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మస్తానయ్య, పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-18T05:11:49+05:30 IST