ఎన్టీఆర్‌ శతజయంతి సంబరాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-27T05:56:21+05:30 IST

స్థానిక బృందావన్‌ గార్డెన్స్‌ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కెఆర్‌కె ఈవెంట్స్‌ నిర్వహణలో ఎన్టీఆర్‌ కళాపరిషత్‌ ఆధ్వర్యంలో గురువారం ఎన్టీఆర్‌ శతజయంతి సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

ఎన్టీఆర్‌ శతజయంతి సంబరాలు ప్రారంభం
సూరెడ్డి రాజేంద్రప్రసాద్‌ను సత్కరిస్తున్న నిర్వాహకులు

గుంటూరు (సాంస్కృతికం) మే 26 : స్థానిక బృందావన్‌ గార్డెన్స్‌ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కెఆర్‌కె ఈవెంట్స్‌ నిర్వహణలో ఎన్టీఆర్‌ కళాపరిషత్‌ ఆధ్వర్యంలో గురువారం  ఎన్టీఆర్‌ శతజయంతి సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు సంస్థ వ్యవస్థాపకులు రామకృష్ణ ప్రసాద్‌ కాట్రగడ్డ అధ్యక్షత వహించారు. సభలో ఆలయ కమిటీ కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు లంకా విజయ్‌బాబు, పరిషత్‌ గౌరవాధ్యక్షులు అంబటి మధుమోహనకృష్ణ, ఎంవిఎల్‌ నరసింహారావు, విశ్రాంత పోలీస్‌ అధికారి బీరం నాగేశ్వరరావు, గాదె రత్నారెడ్డి, జీవిఎస్‌ నాగేశ్వర రావు తదితరులు పాల్గొని ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ రంగాలకు చేసిన సేవలను కొనియాడారు. విజయా పిక్చర్స్‌ పంపిణీ అధినేత సూరెడ్డి రాజేంద్రప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. వై.సంపూర్ణ రాజ్యలక్ష్మి ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన, డాక్టర్‌ పివి రామ్‌కుమార్‌ రచనకు గెద్ద వరప్రసాద్‌ దర్శకత్వం వహించిన నాటకశాల, విజయనగరంవారిచే ఇపుడు నాటిక ప్రదర్శన ఆకట్టుకుంది. 


Updated Date - 2022-05-27T05:56:21+05:30 IST