పేదోడి నెత్తిన బండ

ABN , First Publish Date - 2020-12-03T04:22:09+05:30 IST

గ్యాస్‌ ధర మండిపడింది. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు చుక్కల నంటుతుండగా.. మరో పక్క ఒక్కో గ్యాస్‌ సిలిండర్‌కు రూ.50 పెంచుతూ ఆయిల్‌ కంపెనీలు నిర్ణయిం తీసుకోవడంతో వినియోగదారులపై భారం పడనుంది.

పేదోడి నెత్తిన బండ

ఒక్కో గ్యాస్‌ సిలిండర్‌పై రూ.50 పెంపు 

రోజు వారీ జిల్లాలో 15 వేల సిలిండర్లు వినియోగం

నెలవారీ భారం రూ.2.25 కోట్లు   

ఏలూరుసిటీ, డిసెంబరు 2 : గ్యాస్‌ ధర మండిపడింది. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు చుక్కల నంటుతుండగా.. మరో పక్క  ఒక్కో గ్యాస్‌ సిలిండర్‌కు రూ.50 పెంచుతూ ఆయిల్‌ కంపెనీలు నిర్ణయిం తీసుకోవడంతో వినియోగదారులపై భారం పడనుంది.జిల్లాలో ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.618.50 నుంచి రూ. 627 వరకు ఉంది. ఈ పెంపు కారణంగా ఒక్కో సిలిండర్‌ ధర రూ.668.50 నుంచి రూ. 677ల వరకు పెరగనున్నాయి. జిల్లాలో మొత్తం 14 లక్షల వరకు గ్యాస్‌ కనె క్షన్లు ఉన్నాయి. రోజువారీ జిల్లాలో 10 వేల నుంచి 15 వేల వరకు, నెలవారీ 3 లక్షల నుంచి 4.50 లక్షల వరకు  గ్యాస్‌ సిలిండర్ల వినియో గం జరుగుతుంది. రాయితీ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.50 పెంచడంతో వినియోగదారులపై రోజువారీ రూ.7.50 లక్షలు పెట్టుబడి భారం పడు తోంది. ఈ పెంచిన సొమ్ము సబ్సిడీ కింద బ్యాంకుల్లో జమయినా ముం దుగా వినియోగదారులు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక నెలవారీ భారం పరిశీలిస్తే రూ.2.25 కోట్లు వరకు ఉంటుందని ప్రాథమిక అంచనా. ప్రతీ సారీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు నెలాఖరు రోజున అర్దరాత్రి పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ సారి మాత్రం డిసెబర్‌ 1వతేదీ అర్ధ రాత్రి పెంచుతూ నిర్ణయిం తీసుకున్నారు. పెంచిన రాయితీ గ్యాస్‌ సిలిం డర్‌ ధరలను తగ్గించాలని విపక్షాలు కోరుతున్నాయి. ఇప్పటికే  నిత్యావ సర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని, ఈ సమయం లో గ్యాస్‌ ధరలు పెంచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2020-12-03T04:22:09+05:30 IST