ఇంట్లో LPG సిలిండర్ పేలితే రూ. 50 లక్షల పరిహారం వస్తుందని మీకు తెలుసా? ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసుకోండి!

ABN , First Publish Date - 2022-02-17T16:06:10+05:30 IST

LPG సిలిండర్ ప్రతి ఇంట్లోనూ...

ఇంట్లో LPG సిలిండర్ పేలితే రూ. 50 లక్షల పరిహారం వస్తుందని మీకు తెలుసా? ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసుకోండి!

LPG సిలిండర్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఒక్కో ఇంటిలో రెండు కంటే ఎక్కువ కనెక్షన్లు ఉన్న పరిస్థితులనూ చూస్తుంటాం. అయితే ఒకవేళ పొరపాటున LPG సిలిండర్ పేలితే, మీరు కొన్ని లక్షల రూపాయల కవరేజీకి అర్హులని మీకు తెలుసా? చాలామందికి ఈ విషయం తెలియదు. గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే లేదా సిలిండర్ పేలుడు కారణంగా ఆస్తినష్టం జరిగినట్లయితే, బాధితులకు పరిహారం అందుతుంది. ఏదైనా కారణంగా ఇంట్లో LPG సిలిండర్ పేలుడు జరిగితే నష్టపరిహారాన్ని ఎలా క్లెయిమ్ చేయవచ్చోఇప్పుడు తెలుసుకుందాం. 

50 లక్షల వరకు బీమా

LPG కనెక్షన్ తీసుకున్నప్పుడు, పెట్రోలియం కంపెనీలు కస్టమర్‌కు వ్యక్తిగత ప్రమాద కవరేజీని అందిస్తాయి. గ్యాస్ లీకేజీ లేదా LPG సిలిండర్ నుండి పేలుడు కారణంగా దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగినప్పుడు ఈ రూ. 50 లక్షల వరకు బీమా ఆర్థిక సహాయం రూపంలో ఉంటుంది. ఈ బీమా కోసం, పెట్రోలియం కంపెనీలు బీమా కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉంటాయి. డెలివరీకి ముందు, డీలర్ సిలిండర్ బాగా ఉందో లేదో తనిఖీ చేయాలి. కస్టమర్ ఇంటి వద్ద LPG సిలిండర్ కారణంగా ప్రమాదం జరిగి ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తే వ్యక్తిగత ప్రమాద కవరేజీ అందిస్తారు. ప్రమాదంలో వినియోగదారుని ఆస్తి/ఇంటికి నష్టం జరిగితే, ఒక్కో ప్రమాదానికి రూ.2 లక్షల వరకు బీమా క్లెయిమ్ లభిస్తుంది.




క్లెయిమ్ ఎలా పొందాలి

ఇంట్లో LPG పేలుడు సంభవించినట్లయితే ఎలా క్లెయమ్ చేయవచ్చే ప్రభుత్వ వెబ్‌సైట్ http://mylpg.in లో  వివరించారు. దీనిలోని సమాచారం ప్రకారం, ఎల్‌పిజి కనెక్షన్ తీసుకున్న వెంటనే కస్టమర్ రూ. 50 లక్షల బీమా రక్షణకు అర్హులు. ప్రమాదంలో గరిష్టంగా రూ.50 లక్షల పరిహారం అందుతుంది. బాధితులకు గరిష్టంగా రూ.10 లక్షల పరిహారం ఇవ్వవచ్చు. బీమా రక్షణ పొందడానికి, వినియోగదారుడు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలి. దీనితో పాటు, LPG పంపిణీదారుకు కూడా దీని గురించి చెప్పాలి.  ప్రతి కస్టమర్ ఈ పాలసీలో పరిధిలో ఉంటాడు. ఇందుకోసం అతను ఎలాంటి ప్రీమియం కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎఫ్‌ఐఆర్ కాపీ, గాయపడిన వారి మెడికల్ బిల్లులు, పోస్టుమార్టం రిపోర్టు, మరణిస్తే డెత్ సర్టిఫికెట్ భద్రపరచాలి. అయితే, ప్రతి సందర్భంలోనూ మెరిట్ ఆధారంగా సెటిల్మెంట్ నిర్ణయిస్తారు. గ్యాస్ సిలిండర్‌తో ప్రమాదం జరిగితే, మొదటగా పోలీసులకు రిపోర్టు చేయాలి. దీని తరువాత, సంబంధిత ఏరియా కార్యాలయం ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తుంది. ప్రమాదం LPG ప్రమాదం అయితే, LPG డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీ/ఏరియా కార్యాలయం భీమా సంస్థ స్థానిక కార్యాలయానికి తెలియజేస్తుంది. దీని తర్వాత సంబంధిత బీమా కంపెనీకి క్లెయిమ్ దాఖలు చేయాలి. కస్టమర్ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేయనవసరం లేదు లేదా బీమా కంపెనీని నేరుగా సంప్రదించాల్సిన అవసరం లేదు. గతంలో కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, 2019 సంవత్సరంలో లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా, ఎల్‌పిజి పేలుడు కింద ఏ సంవత్సరంలో ఎంత బీమా అందజేశారో తెలియజేశారు. 2016-2017 సంవత్సరంలో 929 ఎల్‌పిజి పేలుడు ప్రమాదాలు జరిగాయని, అందులో 267 మంది మరణించారని, వారికి పరిహారంగా రూ.22.83 కోట్లు చెల్లించామని తెలిపారు. ఇదేవిధంగా 2017-2018లో 1151 ప్రమాదాలు జరగగా 292 మంది చనిపోయారని, రూ.17.39 కోట్లు పరిహారం చెల్లించామన్నారు. 2018-2019 సంవత్సరంలో 983 ప్రమాదాలు జరగ్గా 254 మంది మరణించారు. అప్పుడు 7.10 కోట్లను ప్రభుత్వం నష్టపరిహారంగా ఇచ్చిందన్నారు. 



Updated Date - 2022-02-17T16:06:10+05:30 IST