బలిఘట్టంలో పేలిన గ్యాస్‌ సిలిండర్‌

ABN , First Publish Date - 2021-10-17T06:25:05+05:30 IST

ఇంట్లో ఉన్న స్పేర్‌ గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోవడంతో భారీగా ఆస్తనష్టం సంభవించింది. ఈ సంఘటన మునిసిపాలిటీ పరిధి బలిఘట్టంలో గురువారం రాత్రి సంభంచింది.

బలిఘట్టంలో పేలిన గ్యాస్‌ సిలిండర్‌
బలిఘట్టంలో గ్యాస్‌ సిలెండర్‌ పేలుడుకు ధ్వంసమైన సామగ్రి

నర్సీపట్నం, అక్టోబరు 16: ఇంట్లో ఉన్న స్పేర్‌ గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోవడంతో భారీగా ఆస్తనష్టం సంభవించింది. ఈ సంఘటన మునిసిపాలిటీ పరిధి బలిఘట్టంలో గురువారం రాత్రి సంభంచింది. అగ్నిమాపక అధికారి టీఎస్‌ఎన్‌ జనార్దనరావు అందించిన వివరాల మేరకు  బలిఘట్టం 17వవార్డుకి చెందిన కిల్లాడ చింతల్లి ఇంట్లో గురువారం రాత్రి 9.30 గంటలకు గదిలో ఉన్న స్పేర్‌ సిలిండర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో రూ.2 లక్షలు విలువ చేసే సామగ్రి దగ్ధం కావడంతో పాటు ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ప్రమాదంలో టీవీ చూస్తున్న చింతపల్లి స్వల్పంగా గాయపడ్డారు. కుటుంబసభ్యులు బయట ఉండడంతో ప్రమాదం తప్పిందని చింతల్లి అల్లుడు శెట్టి రమణ తెలిపారు. పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గరయ్యారు.  


Updated Date - 2021-10-17T06:25:05+05:30 IST