గ్యాస్ సిలిండర్ పేలి దంపతుల మృతి

Sep 25 2021 @ 19:58PM

విశాఖ: జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి దంపతులు మృతి చెందారు. అల్లిపురం వెంకటేశ్వర మెట్ట సమీపంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. గ్యాస్ పేలుడు కారణంగానే భార్య,భర్త మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.