NRI ఇంట్లో చోరీ.. గ్యాస్ సిలిండర్ ఎత్తుకుపోయిన నిందితుడు..!

ABN , First Publish Date - 2022-07-18T01:04:38+05:30 IST

పంజాబ్‌లో ఓ ఎన్నారై ఇంట్లో చోరికి తెగబడ్డ నిందితుడు గ్యాస్ సిలిండర్, ఇన్వర్టర్, ఓ బ్యాటరీని తస్కరించాడు.

NRI ఇంట్లో చోరీ.. గ్యాస్ సిలిండర్ ఎత్తుకుపోయిన నిందితుడు..!

ఎన్నారై డెస్క్: పంజాబ్‌లో ఓ ఎన్నారై ఇంట్లో చోరికి తెగబడ్డ నిందితుడు గ్యాస్ సిలిండర్, ఇన్వర్టర్, ఓ బ్యాటరీని తస్కరించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుదాస్‌పూర్(Gurdaspur) జిల్లా బాత్వాలాసుఖా గ్రామానికి చెందిన NRI హర్‌దయాళ్ సింగ్ అమెరికాలో నివసిస్తుంటారు. స్వగ్రామంలో ఆయనకు ఓ ఇల్లు ఉంది. ఇంటి బాగోగులు చూసుకునేందుకు జనని అనే మహిళను పనిలో పెట్టుకున్నారు. ఇంటి తాళం చెవులు ఆమెకే ఇచ్చారు. రోజూలాగే ఆమె జూలై 11న ఇల్లు శుభ్రం చేసేందుకు వచ్చింది. అయితే.. ఇంటి కిటికీ చువ్వలు ఒంగిపోయి ఉండటం చూసి షాకైపోయింది. లోపలకు వెళ్లి చూడగా.. గ్యాస్ సిలిండర్, ఇన్వర్టర్, బ్యాటరీ చోరీకి గురైనట్టు గుర్తించింది. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసుకున్న వారు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో జనని తండ్రి బల్బీర్ సింగ్ ఈ చోరీకి పాల్పడ్డట్టు తేలింది. దీంతో..పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

Updated Date - 2022-07-18T01:04:38+05:30 IST