Advertisement

నెత్తిన బండ

Feb 25 2021 @ 23:34PM
గ్యాస్‌ సిలిండర్లు

గ్యాస్‌ ధరలు మళ్లీ పెంపు

సిలిండర్‌పై తాజాగా రూ.25 పెంచిన కేంద్రం 

ఈనెలలో మూడు సార్లు పెరిగిన వైనం

గగ్గోలు పెడుతున్న వినియోగదారులు 

(కలెక్టరేట్‌) 

గ్యాస్‌ వినియోగదారులపై ఊహించిన స్థాయిలో భారం పడుతోంది. ఎప్పుడూ లేని విధంగా ఒకే నెలలో మూడుసార్లు గ్యాస్‌ ధర పెంచారు. దీనిపై సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా మోదడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజా సంఘాలు గ్యాస్‌ ధరలపై మండిపడుతూ నిరసన స్వరాన్ని పెంచాలని భావిస్తున్నాయి. 

ప్రతిసారి రూ.25 నుంచి రూ.50 వరకూ గ్యాస్‌ ధర పెరుగుతోంది. పెట్రోలు, డీజిల్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో గ్యాస్‌ వినియోగదారులపై కూడా వారం వారానికి అదనపు భారం వేయడాన్ని అన్ని వర్గాలూ నిరసిస్తున్నాయి. రాయితీ సిలిండర్‌పై ఈ నెల మొదటి వారంలో రూ.25 పెంచగా, ఈనెల 15న  రూ.50 పెంచింది. ఇప్పుడు మళ్లీ రూ.25 పెరిగింది. ప్రసుత్తం సిలిండర్‌ ధర రూ.810కు చేరింది. గత ఏడాది ఇదే సమయానికి రూ.730 ఉండేది. అప్పట్లో వినియోగదారుని బ్యాంకు ఖాతాకు దాదాపు రూ.176 జమ అయ్యేది. సబ్సిడీ తగ్గించేయడంతో  ఖాతాలో పెద్దగా డబ్బులు పడడం లేదు. జిల్లాలో సుమారు 31 పైగా గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిల్లో  సుమారు 5,50,000 కనెక్షన్లు ఉన్నాయి. నెలకు జిల్లాలో దాదాపు 2,00,000 నుంచి 2,25,000 సిలిండర్లు వాడుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా సిలిండరుకు రూ.25 పెరగడం వల్ల వినియోగదారులపై నెలకు సుమారు రూ.6 కోట్ల వరకూ అదనపు భారం పడనుంది. పెరిగిన ధరతో గ్యాస్‌ కొనుగోలుకు భయపడిపోతున్నారు. 


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.