Bill and melinda gates foundation ఉద్యోగుల్లో భవిష్యత్తుపై బెంగ!

ABN , First Publish Date - 2021-07-12T02:29:35+05:30 IST

బిల్ అండ్ మెలిందా గేట్స్ షౌండేషన్ ఉద్యోగులు సంస్థ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని మాజీ ఉద్యోగి ఒకరు తాజాగా వెల్లడించారు.

Bill and melinda gates foundation ఉద్యోగుల్లో భవిష్యత్తుపై బెంగ!

వాషింగ్టన్: బిల్ అండ్ మెలిందా గేట్స్ షౌండేషన్ ఉద్యోగులు సంస్థ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని మాజీ ఉద్యోగి ఒకరు తాజాగా వెల్లడించారు. స్త్రీ-పురుష సమానత్వం, మహిళా అభ్యున్నతికి సంబంధించి సంస్థ విశ్వసనీయత దెబ్బతిందని వారు భావిస్తున్నట్టు సదరు ఉద్యోగి పేర్కొన్నారు. బిల్ గేట్స్ దంపతులు ఈ ఏడాది మే నెలలో తాము విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత బిల్ గేట్స్ వ్యవహారసరళిపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిల్ తన హోదాతో కింద స్థాయి ఉద్యోగులను భయపెట్టేవారని, ఓ ఉద్యోగినితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు వీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బిల్ అండ్ మెలిందా గేట్స్ ఉద్యోగులు సంస్థ విశ్వసనీయత దెబ్బతిందని ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. ఈ ఫౌండేషన్ అనేక దేశాల్లో సమాజహితం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ల అభివృద్ధి-పంపిణీ, పారిశుధ్యం, మహిళా అభ్యున్నతి వంటి అంశాల్లో స్థానిక ప్రభుత్వాలతో చేయి కలిపి సమాజ అభ్యున్నతి కోసం పాటుపడుతోంది. ఇక విడాకుల తరువాత కూడా కొంత కాలం పాటు బిల్ గేట్స్, మెలిందా కో-చైర్మన్‌లు గా వ్యవహరిస్తారు. ఈ విషయాన్ని వారే స్వయంగా ప్రకటించారు. 

Updated Date - 2021-07-12T02:29:35+05:30 IST