గట్టు మాదే.. చెట్టూ మాదే..

ABN , First Publish Date - 2021-03-04T05:26:01+05:30 IST

‘కంచె ఎందుకు మేముండగా.. కాపాలా ఎందుకు కావలిగా నిల్చుండగా’.. అన్నట్టుగా ఉంది వరి చేను చుట్టూ ఉన్న కొంగల భేరి.

గట్టు మాదే.. చెట్టూ మాదే..
చెట్టుపై వాలిన కొంగలు

‘కంచె ఎందుకు మేముండగా.. కాపాలా ఎందుకు కావలిగా నిల్చుండగా’.. అన్నట్టుగా ఉంది వరి చేను చుట్టూ ఉన్న కొంగల భేరి. పంటకు రక్షణగా తీగ కట్టిన చందంగా వరుసగా ఉన్న విహంగాలు చూపరులను కనివిందు చేశాయి. అలాగే అదే వరి పొలాల్లో ఉన్న మామిడి చెట్టుపై వాలిన కొంగలు అప్పుడే విరిసిన తెల్లటి పూలను తలపిస్తున్నాయి. కొమ్మకొమ్మకు ఓ పువ్వు అన్నట్టుగా ఆకట్టుకుంటున్నాయి. నవాబ్‌పేట మండలం తీగలపల్లి గ్రామ శివారులోని పంట పొలాల్లో ఈ దృశ్యాలు కనిపించాయి.

- ఆంధ్రజ్యోతి, ఫొటో జర్నలిస్టు, మహబూబ్‌నగర్‌




Updated Date - 2021-03-04T05:26:01+05:30 IST