Gambhir Angry: కేఎల్ రాహుల్‌పై గంభీర్ అసహనం.. మ్యాచ్‌లో ఏం జరిగింది?

ABN , First Publish Date - 2022-05-26T21:43:39+05:30 IST

ఐపీఎల్ 2022 చివరి దశకు చేరుకుంది. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌ ఓటమి పాలవడంతో..

Gambhir Angry: కేఎల్ రాహుల్‌పై గంభీర్ అసహనం.. మ్యాచ్‌లో ఏం జరిగింది?

ఐపీఎల్ 2022 చివరి దశకు చేరుకుంది. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌ ఓటమి పాలవడంతో ఎలిమినేట్ అయ్యింది. గుజరాత్ టైటాన్స్‌తో పాటు టైటిల్ ఫేవరేట్‌గా బరిలో దిగిన లక్నో కీలకమైన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో లక్నో ఫీల్డర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో ఓటమికి ఫీల్డర్లు కారణమయ్యారు. బెంగళూరు టీమ్‌కు బెస్ట్ ఫినిషర్‌గా ఉన్న దినేశ్ కార్తీక్‌ క్యాచ్‌ను లక్నో కెప్టెన్‌ కేఎల్ రాహుల్ జారవిడిచాడు. 15వ ఓవర్‌లో మెహ్షిన్ ఖాన్ బౌలింగ్‌లో కార్తీక్ బంతిని ఇన్‌ఫీల్డ్ దాటించేందుకు ప్రయత్నించాడు. ఆ షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది.


దీంతో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ డైవ్ చేస్తూ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. క్యాచ్ అందుకున్న సమయంలో బాల్‌ చేతి నుంచి జారి పోయింది. దీంతో డగౌట్‌లో ఉన్న లక్నో మెంటర్‌ గౌతమ్ గంభీర్‌ తీవ్ర నిరాశ చెందాడు. ముందుగా క్యాచ్‌ అందుకున్నాడు అని క్లాప్స్ కొట్టిన గంభీర్‌.. ఆఖరి క్షణంలో క్యాచ్ వదిలేయడంతో ఒక్కసారిగా తల పట్టుకున్నాడు. గంభీర్‌ రియాక్షన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 2 పరుగులు దగ్గర దినేశ్ కార్తీక్‌కు లైఫ్ దొరకడంతో ఆఖరిలో బౌండరీల వర్షం కురిపించాడు.

Updated Date - 2022-05-26T21:43:39+05:30 IST