Gautham Menon: విజయ్ చిత్రంలో గౌతమ్ మీనన్ విలన్‌గా నటించనున్నాడా..?

Published: Mon, 15 Aug 2022 18:13:12 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Gautham Menon: విజయ్ చిత్రంలో గౌతమ్ మీనన్ విలన్‌గా నటించనున్నాడా..?

కోలీవుడ్ స్టార్ హీరోల్లో విజయ్ (Vijay) ఒకరు. అభిమానులందరు ముద్దుగా ఇళయదలపతి (Thalapathy) అని పిలుచుకుంటుంటారు. ప్రస్తుతం విజయ్ ‘వారసుడు’ లో నటిస్తున్నాడు. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుంది. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. జయసుధ, శరత్ కుమార్, ప్రభు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. వంశీతో ప్రాజెక్టును పూర్తి చేయగానే విజయ్ తన తర్వాతి చిత్రాన్ని లోకేశ్ కనకరాజ్ (Lokesh Kangaraj) దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాను ‘దళపతి-67’ అని వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త కోలీవుడ్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తుంది.


‘దళపతి-67’ను సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ఆరుగురు విలన్స్ నటించనున్నారని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. సంజయ్ దత్ (Sanjay Dutt), పృథ్వీ‌రాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun)లతో మేకర్స్ చర్చలు జరుపుతున్నారని సమాచారం. మరో విలన్‌గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) ను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఒక వేళ ఈ వదంతులు కనుక నిజమైతే గౌతమ్ మీనన్, విజయ్‌తో చేయబోయే తొలి చిత్రం ఇదే అవుతుంది. తాజాగా లోకేశ్ ‘విక్రమ్’ కు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. టాలీవుడ్‌లోను ఘన విజయం సాధించింది. దీంతో లోకేశ్ త్వరలో విజయ్‌తో చేయనున్న ప్రాజెక్టుపై భారీ అంచనాలేర్పడ్డాయి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International