గాయత్రీధారణ మహోత్సవం

Published: Sat, 13 Aug 2022 00:29:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 గాయత్రీధారణ మహోత్సవంయజ్ఞోపవీతంను ధరిస్తున్న చేనేత సహకార సంఘం సభ్యులు

చిట్యాలరూరల్‌, ఆగస్టు 12: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని చిట్యాల మండలం నేరడ గ్రామంలో శుక్రవారం చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో గాయత్రీధారణ మహోత్సవాన్ని నిర్వహించారు. గ్రామంలో ని సీతారామాంజనేయస్వామి దేవాలయంలో (యజ్ఞోపవీతధారణ) ఘ నంగా నిర్వహించారు. నవగ్రహ పూ జ, గ్రాయత్రీహోమం అనంతరం రా ఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఏడాది పురుషులు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించా రు. ఈ సందర్భంగా పురోహతులు మాట్లాడుతూ వివాహ సమయంలో పురషులకు యజ్ఞోపవీతాన్ని వేదమంత్రోచ్ఛారణల నడుమ ధరిస్తారని, యజ్ఞోపవీతాన్ని గాయత్రీధారణ అని కూడా పిలుస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మ హేందర్‌, దేవాలయ కమిటీ వ్యవస్థాపక చైర్మన పాపని జనార్ధన, చైర్మన ముశం రా మస్వామి, కార్యదర్శి శ్రీనివాస్‌, సభ్యులు లక్ష్మయ్య, భిక్షం, అంజయ్య పాల్గొన్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.