నేనిప్పటికీ బెస్ట్ బ్యాట్స్‌మన్‌నే.. విండీస్‌కు ఆడడానికి రెడీ: గేల్

Mar 2 2021 @ 15:53PM

బార్బడోస్: వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ జాతీయ జట్టుకు ఆడడడంపై ఎట్టకేలకు నోరు విప్పాడు అన్నాడు. శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్‌లో విండీస్ జట్టుకు ప్రాతినిథ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని, జట్టులో ఏ స్థానంలోనైనా ఆడగల సత్తా ఇప్పటికీ తనలో ఉందని గేల్ చెప్పారు. ‘నేను ఓపెనర్‌ని కావడం వల్ల స్పిన్ చక్కడా ఆడగలను. పేస్ బౌలర్లను అదే తరహాలో ఎదుర్కోగలనం’టూ గేల్ చెప్పుకొచ్చాడు. అయితే గతేడాది ఐపీఎల్‌లో తాను మూడో స్థానంలో ఆడానని, ఇప్పుడు తాను నెంబర్ 3 స్పెషలిస్ట్‌గా మారానని గేల్ అన్నాడు. ‘పంజాబ్‌కు ఆడుతున్నప్పుడు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లు ఓపెనింగ్ జోడీగా దిగడంతో నేను మూడో స్థానంలో దిగాను. అయినా గొప్పగా ఆడాను. మూడో స్థానంలో ఆడడం వల్ల నేను ఎలాంటి ఇబ్బందులనూ ఎదుర్కోలేదం’టూ గేల్ చెప్పుకొచ్చాడు.

ఇప్పటివరకు విండీస్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిగినట్లు చెప్పారు. అయితే ఈ సిరీస్‌ తరువాత టీ20 ప్రపంచ కప్‌ జట్టులో కూడా స్థానం సంపాదించాలని ఆశిస్తున్నానని గేల్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ తాను ప్రపచం బ్యాట్స్‌మెన్‌లలో బెస్ట్‌గానే ఉన్నానని, ఓపెనర్, మూడో స్థానం, ఐదో స్థానం ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలనని అన్నాడు. 

తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగడం పై కూడా ఆలోచన చేశానని, త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని అన్నాడు. అయితే ప్రాంచైజీ క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని అన్నాడు. ఇదిలా ఉంటే 2019 ప్రపంచ కప్ తరువాత గేల్ జాతీయ జట్టుకు మళ్లీ ఆడలేదు. మరి శ్రీలంక సిరీస్‌కు ఎంపికైన గేల్.. విండీస్ జెర్సీలో  ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో చూడాలి.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.