Raj Kundra కు Sherlyn Chopra రుణపడి ఉండాలి.. ఆయన వల్లే కోట్లు సంపాదించిందంటూ..

Sep 28 2021 @ 12:53PM

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా నీలి చిత్రాల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రాజ్‌కుంద్రాకి ఇటీవలే ముంబై కోర్టు బెయిలు మంజూరు చేసింది. రా‌జ్‌తో పాటు అదే కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ గెహనా వశిష్ట్‌.. 133 రోజులు కస్డడీ అనంతరం ఇటీవలె బెయిల్‌పై బయటకు వచ్చింది. ఆల్ట్ బాలాజీ సిరీస్ `గంధీ బాత్`లో హాట్‌హాట్‌గా నటించి గెహనా పాపులర్ అయింది. తాజాగా ఆమె కుంద్రాకు మద్దతుగా మాట్లాడుతూ హీరోయిన్ షెర్లిన్ చోప్రాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. 


`షెర్లిన్ చోప్రా ఈ స్థాయికి వచ్చి కోట్లు సంపాదించడానికి రాజ్ కుంద్రా ఎంతో సహాయం చేశాడు. ఆయన ప్రారంభించిన `ఆర్మ్‌ స్ప్రైమ్` యాప్ ద్వారానే షెర్లిన్ ఈ స్థాయికి వచ్చింది. అందుకు ఆమె కుంద్రాకి రుణపడి ఉండాలి. నిజానికి షెర్లిన్ వల్లే కుంద్రా ఈ ఊబిలో ఇరుక్కుపోయారు. వ్యాపారవేత్త అయిన కుంద్రాను నీలి చిత్రాల తీసేలా పురికొల్పింది షెర్లినే. 2012 నుంచే షెర్లిన్‌ బోల్డ్‌ కంటెంట్‌ చిత్రాలు చేస్తోంది. కెమెరా ముందు బట్టలు విప్పడం తప్ప ఆమెకు ఇంకేం రాదు. వార్తల్లో ఉండడం కోసం ఆమె శిల్పాను, రాజ్ కుంద్రాను విమర్శిస్తోంద`ని గెహనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.  

Follow Us on:

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.