హాట్ సన్నివేశాలతో అలరిస్తోన్న దీపిక, సిద్ధాంత్.. ‘గెహ్రాయియా’ ట్రైలర్ రిలీజ్..

Published: Thu, 20 Jan 2022 20:09:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
హాట్ సన్నివేశాలతో అలరిస్తోన్న దీపిక, సిద్ధాంత్.. గెహ్రాయియా ట్రైలర్ రిలీజ్..

సరికొత్త కథలకు కేరాఫ్ అడ్రస్ బాలీవుడ్. అటువంటి కథతోనే బీ టౌన్‌లో ఒక సినిమా తెరకెక్కింది. ఆ చిత్రం పేరు ‘గెహ్రాయియా’. దీపికా పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే కీలక పాత్రల్లో నటించారు. శకున్ బత్రా దర్శకత్వం వహించారు. వయాకాం 18 పిక్చర్స్‌తో కలిసి కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మించింది. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. స్నేహం, ప్రేమ, జీవితం వంటి అంశాలతో చిత్రాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. దీపికా పదుకొణె-సిద్ధాంత్ చతుర్వేది తమ హాట్‌హాట్ సన్నివేశాలతో ‘గెహ్రాయియా’ను రక్తికట్టించినట్టు ట్రైలర్‌ని బట్టి అర్థమవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 11న ఈ సినిమా విడుదల కానుంది.


దీపిక ట్రైలర్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ‘‘ప్రేమ, జీవితాన్ని అనుభూతి చెందడానికి రెడీగా ఉండండి’’ అని ఆమె సోషల్ మీడియాలో కామెంట్ పోస్ట్ చేసింది. ‘‘ప్రేమకు సంబంధించిన అన్ని కోణాలను అనుభవించడానికి సిద్దంగా ఉండండి’’ అని కరణ్ జోహార్ సోషల్ మీడియాలో మెసేజ్ పోస్ట్ పెట్టారు. ఈ సినిమాలో ధైర్యా కర్వా, నసీరుద్దీన్ షా, రజత్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...